Kids

శ్రామికుల ఆశాజ్యోతి…కార్ల్ మార్క్స్

Remembering Carl Marx On His 132nd Birth Anniversary

ప్రపంచ మహోపాధ్యాయుడు మార్స్క్ జయంతి మే5

వర్గం మాత్రమే ఉంది, వర్ణం లేదని నమ్మి, పేద,ధనిక మధ్య అంతరం పోవాలంటే అందరూ శ్రమించాలని వనరులు పంపిణీ జరగాలని దోపిడి రహిత సమాజం ఏర్పాడాలని కలలుగన్న, కార్మికుల,శ్రామికుల శ్రమదోపిడిని నిరసించిన కారల్ మార్క్స్ ది 5-5-1818 లో జర్మనీలో జన్మించారు.

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని తన కాపిటల్ గ్రంథంలో వివరించారు.పేదరికాన్ని రూపుమాపడానికి అనేక రచనలు వారి సహచరుడు ఫ్రెడరిక్ ఏంగిల్స్ తో కలిసి చేశారు.

ప్రపంచంలో సోవియట్ తో బాటు అనేక దేశాలలో మార్స్క్ ప్రవచిత ప్రజారాజ్యాలు వచ్చాయి.మార్క్స్ సిద్థాంతానికి స్థానికత జోడించి మావో సేటుంగ్ 1949 లో చైనా లో ప్రజారాజ్యం స్థాపించి మావో విజమ్ ఆవిర్భయించింది.

1990ల లో రష్యాలో వచ్చిన పెనుమార్పులు గ్లాస్త్ నాస్త్ , పెరిస్ట్రయికా వలన సోవియట్ ఇతర ఐరోపా దేశాలు పతనమయ్యాయి.ప్రపంచాన్ని కమ్యునిస్టు భూతం ఆవరిస్తున్నది అని గగ్గోలు పెట్టిన పెట్టుబడి దారులు,సామ్రాజ్యవాదులు మార్క్స్ సిద్థాంతానికి కాలం చెల్లింది అని పెదవి విరిచారు.

మార్క్స్ పని అయిపోయింది అన్నవారే ఇప్పటికి మార్క్స్ తాలూకా సిద్థాంతం అయిన కమ్యూనిజం భయం నీడలో కాలం వెళ్ళ దీస్తున్నారు అనేది వాస్తవం.

ప్రపంచీకరణ ,ప్రవేటీకరణ నేపథ్యం మార్స్క్ సిద్థాంతం కొంచెం మందగమనంలో ఉన్నప్పటికి మార్క్స్ సిద్థాంతం అజరామర మైనది.నిత్యనూతనమైనది.బడుగుల ఉద్థరణ మార్క్స్ సిద్థాంతమే పరిష్కారం. మానవత్వం గురించి పనిచేసే ప్రతివారు మార్కిస్టులే.

నేటి అనేక ప్రజా సంఘాలు,కార్మిక సంఘూలు,ఉపాధ్యాయ ఉద్యమ సంఘాలకు మూలం మార్క్స్ సిద్థాంతమే.

యాజమాన్యాల దోపిడిని వ్యతిరేకించిన అమరులు కామ్రేడ్లు చెన్నుపాటి లక్ష్మయ్య,సింగరాజు రామకృష్ణయ్య,వీణా విజయరామరాజు,పెర్నా శ్రీరామమూర్తి,వి.పి.రాఘవాచారి, అప్పారి వెంకటస్వామి లాంటి అనేక మంది ఉపాధ్యాయ నాయకుల త్యాగాల ఫలితమే మన పొందుతున్న సౌకర్యాలు.

8గంటల పని, పనికి తగ్గవేతనం, పలు సంక్షేమ పథకాలు కార్మికులకు భీమా, రైతులకు మద్థతుధర మొదలగునవి మార్స్క్ సిద్థాంత ప్రతిఫలాలే.

అనేక విప్లవాత్మకమైన మార్పులకు కారణమైన మార్క్స్ మహాశయడు భూమి మీద మానవాళి మనుగడ ఉన్నంతకాలం, పీడన పోయే వరకు శాశ్వతంగా ఉంటారు

మార్క్స్ మహాశయునికి 132వ జయంతి సందర్భంగా అరురారుణ వందనాలు,ఘననివాళులు.