Agriculture

రాగల మూడురోజుల్లో ఒక మోస్తరు వర్షాలు

Telugu Agriculture News-Rains Coming For Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన:
———————————————–
విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మరియు రాయలసీమ మీదుగా 0.9 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

దక్షిణ అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

కోస్తా ఆంధ్ర మరియు యానాం:
——————————————
ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ:
——————–
ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

— సంచాలకులు,
అమరావతి వాతావరణ కేంద్రము.