కరోనా మహమ్మారినేపథ్యంలో ప్రజలకు మానసిక స్థైర్యాన్ని కలిగించడంలో ఆధ్మాత్మికవేత్తలు, సామాజికవేత్తల ప్రభావం కీలకమని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గురువారం శ్రీ దీదీ రతన్ మోహిని (బ్రహ్మకుమారీస్), శ్రీ అబు ఓస్వాల్డ్ కార్డినల్ గ్రేసియస్ (సీబీఎస్ఐ, అధ్యక్షుడు), శ్రీ చిన్నజీయర్ స్వామి, శ్రీ స్వామి చిత్తానంద సరస్వతి, శ్రీ స్వామి శాత్మానంద, శ్రీ స్వామి సువర్ణానంద, శ్రీ స్వామి జ్ఞానానంద, శ్రీ షరీఫ్ అమీన్ పఠాన్ (అజ్మీర్ దర్గా చీఫ్), శ్రీ మంజిత్ సింగ్ (ఢిల్లీ బంగ్లా సాహెబ్ గురుద్వారా), శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, శ్రీ స్వరూపానంద స్వామి, శ్రీ స్వామి పరిపూర్ణానంద, శ్రీ కమలానంద భారతి, శ్రీ ఖాదర్ వలీ, శ్రీ సుభాష్ పాలేకర్ (సేంద్రీయ వ్యవసాయం)లతో ఆయన ఫోన్లో మాట్లాడారు. వారి క్షేమసమాచారాలను అడిగితెలుసుకున్న ఉపరాష్ట్రపతి.. కష్టకాలంలో ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని తీసుకువచ్చేందుకు కృషిచేయాలని కోరారు.
ఆధ్యాత్మికవేత్తలకు ఉప-రాష్ట్రపతి విజ్ఞప్తి
Related tags :