`రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తి బతికేవాడు` అంటూ త్యాగరాజ స్వామిని ఉద్దేశించి తమిళ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. త్యాగరాజ స్వామిని దేవుడిలా కొలిచే ఎంతో మంది కర్ణాటక సంగీతకారులు కమల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ ప్రముఖ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కోసం ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్న కమల్ పలు ఆసక్తికర విషయాలు చర్చించాడు. చర్చ సందర్భంగా సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. `సినిమా అంటే టిక్కెట్లు అమ్మి డబ్బు సంపాదించే వ్యాపారం. ఇది ఛారిటీ కాదు. త్యాగరాజ స్వామిలా తంజావూరు వీధుల్లో రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తుకోవడం కాదు` అంటూ కమల్ వ్యాఖ్యానించాడు. కమల్ వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కమల్ నుంచి క్షమాపణ కోరుతూ సంగీతకారుడు పాల్ఘాట్ రామ్‌ప్రసాద్ ఆన్లైన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌కు మద్దతుగా ఇప్పటికే 16వేల మంది సంతకాలు చేశారు.
త్యాగరాజస్వామి బిచ్చగాడు
Related tags :