ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీని ప్రత్యక్షంగా తిలకించడం కోసం టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు టికెట్ వెల మొత్తాన్ని రిఫండ్ చేయనున్నట్లు ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య (ఎఫ్‌టీఎఫ్) గురువారం ప్రకటించింది. నిజానికి మే 24 నుంచి జూన్ 7 మరకు జరగాల్సిన ఈ టోర్నీని కరోనా మహమ్మారి వల్ల సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్లను కొన్న ప్రేక్షకులకు డబ్బును తిరిగి చెల్లించాలని నిర్వాహకులు నిర్ణయించారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 కు మారిన షెడ్యూల్ ప్రకారం చేపట్టే టికెట్ల విక్రయాన్ని ఈవెంట్‌కు ముందు వెల్లడిస్తామని ఎఫ్‌టీఎఫ్ వర్గాలు తెలిపాయి. వైరస్ విజృంభిస్తుండటంతో ఆల్ ఇంగ్లండ్ క్లబ్… వింబుల్డన్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఫ్రెంచ్ ఒపెన్ డబ్బులు వాపస్
Related tags :