తెలంగాణ సర్కారు రైతు సంక్షేమ ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలోని 5.50 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణమాఫీకి రూ.1,200 కోట్లు, రైతుబంధు పథకానికి రూ.7 వేల కోట్లు వెంటనే విడుదల చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీచేశారని ఆయన శుక్రవారం ట్విట్టర్‌లో తెలిపారు. అనేక పథకాల ద్వారా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. తమను రాష్ర్టానికి తీసుకెళ్లాలని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలంగాణవారు మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తిచేశారు. పని కోసం వలసవెళ్లి గుజరాత్‌లో చిక్కుకున్న తమను స్వస్థలాలకు తీసుకెళ్లాలని నల్లగొండ జిల్లా నకిరేకల్, కట్టంగూరు ప్రాంతాలకు చెందిన 40 మంది వలస కూలీలు ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ను కోరారు. గుజరాత్‌రాష్ట్రంలోని సూరత్ ఎన్‌ఐటీలో చదువుతున్న 30 మంది విద్యార్థులు సైతం స్వస్థలాలకు తీసుకెళ్లాలని కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తిచేశారు. ఈ వినతులపై సానుకూలంగా స్పందించిన ఆయన.. వారిని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
₹7వేల కోట్లకు ఆదేశాలు ఇచ్చారు
Related tags :