Business

డబ్బుల్లొద్దు. కంపెనీ మూసేయండి.

Vizag Gas Leak Protesters Deny Money Want Company Closed

మీ డబ్బు మాక్కొద్దు…ఎల్ జీ పాలిమర్స్ కంపెనీని మూసేయాలంటూ స్థానికులు ఆందోళన బాటపట్టారు. ఎల్జీ పాలిమర్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్‌ జీ పాలిమర్స్‌ నుంచి విడుదలైన స్టైరీన్ అనే ర‌సాయన వాయువు ప్రభావంతో ఫ్యాక్టరీ చుట్టు పక్కల ఐదు గ్రామాల ప్రజలు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. 12 మంది చ‌ని పోయారు. 400మంది ఆస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై స్థానికులు ఆందోళన చేపట్టారు. తమ కుటుంబ సభ్యుల ప్రాణం తీసిన ఎల్ జీ పాలిమర్స్ కంపెనీని అక్కడి నుంచి తరలించాలని చనిపోయిన డెడ్ బాడీలతో కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే గ్యాస్ లీకైన ప్రాంతాన్ని సందర్శించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మహిళలు కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని కోరారు. కంపెనీని ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. సవాంగ్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా…తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియా తమకు వద్దని…కంపెనీని మూసేయాలంటూ ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలు ధర్నాకు దిగాయి. అయితే వారిని సముదాయించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ నగర కమీషనర్ ఆర్కే మీనా స్థానికులు సంయమనం పాటించాలని, న్యాయం జరిగేలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు.