* ల్యాండ్ రిజిస్ట్రేషన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి మరో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ది రవాణా రంగం. తెలంగాణలో లాక్ అవుట్ పాక్షికంగా ఎత్తివేసిన సందర్భంలో అటు ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, ఇటు ట్రాన్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ కొనసాగుతున్నాయి గత వారం నుండి నుండి ప్రారంభమైన ఈ రిజిస్ట్రేషన్స్ చాలామంద కోడిగా కొనసాగుతున్నాయి. రవాణా శాఖ కూకట్పల్లి కార్యాలయంలో ఈ రిజిస్ట్రేషన్స్ ఆరో తారీకు ప్రారంభమైనా ఆరోజు సర్వర్ ఓపెన్ కాలేదు మరుసటి రోజు ఎలాంటి రిజిస్ట్రేషన్ జరగలేదు ఎనిమిదో తారీకు మాత్రం రెండంటే రెండు రిజిస్ట్రేషన్స్ జరిగాయి ఇక శని ఆదివారాలు సెలవు. ఈరోజు ఇక్కడ కేవలం మూడు వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వచ్చాయి. దీనిపై ఆర్టిఓ సుశీల్ రెడ్డి మాట్లాడుతూ వెహికల్ షోరూమ్స్ ఓపెన్ కాకుండా నూతన వాహనాలు కొనుగోలు జరగకుండా అప్పుడే రిజిస్ట్రేషన్స్ భారీగా జరగవని తాము భావిస్తున్నామన్నారు లైసెన్స్ రెన్యువల్ సైతం గడువు పొడిగించడం తో రెండు నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నారు.
* కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కరోనా ప్యాకేజీ సరిపోలేదని, ఇది ఇప్పుడు ఇంకా తక్కువగా కనిపిస్తోందన్నారు మాజీ ఆర్బిఐ గవర్నర్ సుబ్బారావు అన్నారు…కేంద్ర, రాష్ట్రాల సంయుక్త ద్రవ్య లోటు ఈ ఆర్థిక సంవత్సరంలో 13-14 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ దువూరి సుబ్బారావు తెలిపారు… లాక్డౌన్ కారణంగా కేంద్రం మార్చి 26 న ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన సరిపోదన్నారు.
* విశాఖపట్నం సమీపంలోని ఆర్.ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని సోమవారం పంపిణీ చేశారు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులను మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు, బొత్స సత్యనారాయణ పరామర్శించారు. మృతి చెందిన వారిలో పలువురి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.కోటి చెక్కులు అందజేశారు. క్షతగాత్రులకు రేపటి నుంచి పరిహారం అందించనున్నట్లు మంత్రులు తెలిపారు.
* బస్తాకు రూ.70వరకూ పెరిగిన ధర. లాక్‌డౌన్‌తో కుదేలైన నిర్మాణ రంగం. ఇప్పుడు ధర పెంపుతో పూర్తి స్తబ్దత. ఇసుక, సిమెంటు రేట్లు ఆకాశంలోకి. నేలచూపులు చూస్తున్న అమ్మకాలు. పీకల్లోతు కష్టాల్లో నిర్మాణదారులు. 40లక్షల మంది కార్మికులకూ గడ్డుకాలం. సిమెంటు ధర మండిపోతోంది. బస్తాకు ఏకంగా రూ.70 వరకూ పెరగడంతో నిర్మాణరంగం పరిస్థితి నిప్పుల కొలిమిలో పడినట్లయింది. ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు లేక ఆదాయం పూర్తిగా పడిపోయింది. వాస్తవానికి అంతకుముందు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇసుకకు ధర పెట్టడం, ఇసుక కొరతతో పెరిగిన ధరలు, మూడు రాజధానుల నిర్ణయంతో ఎక్కడికక్కడ అమ్మకాలు నిలిచిపోవడంతో నిర్మాణదారులు కుదేలయ్యారు. చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అప్పులు చేయాల్సి రావడం, వాటికి పెరుగుతున్న వడ్డీలు.. ఇవన్నీ పడలేక కొందరు హైదరాబాద్‌కు తరలిపోయారు. మరికొందరు అసలు ఈ రంగమే వదిలేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పుడు లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చి కొంతమేర నిర్మాణాలు ప్రారంభిద్దాం అనుకునేసరికి సిమెంటు ధర ఆకాశాన్నంటుతోంది. కంపెనీని బట్టి ఒక్కో బస్తా రేటు రేటు రూ.70వరకు పెరిగింది. గతంలో రూ.250 ఉన్నది ఇప్పుడు రూ.320కి, గతంలో రూ.300 ఉన్న బ్యాగ్ ఇప్పుడు రూ.370 అయింది. దూరాభారాన్ని బట్టి దాదాపు రూ.400కు కూడా చేరుతోంది. రాష్ట్రంలో నిర్మాణ రంగంపై ఆధారపడిన సుమారు 20 వృత్తుల వారు దాదాపు 40లక్షల మంది ఉన్నారని అంచనా. ఇంతమందికి ఉపాధి కల్పించాల్సిన నిర్మాణదారులు బేలచూపులు చూస్తున్నారు. మోయలేనంత భారంగా ఉన్నా ప్రాజెక్టులు పూర్తిచేద్దామని అనుకున్నవారు…. ధరల పెరుగుదలతో మరింత బెంబేలెత్తిపోతున్నారు.