‘బెర్క్‌షైర్ హాథ్‌వే’ వాటాదార్లు. శనివారం ఈ కంపెనీ వార్షిక వాటాదార్ల సమావేశం జరిగింది. సాయంత్రం నుంచే సమావేశ ప్రాంగణానికి వాటాదార్ల రాక ప్రారంభమైంది. ఓ తండ్రి కొడుకులు ఇద్దరూ బఫెట్ ఫొటో ముద్రించి ఉన్న దుస్తులతో వచ్చారంటేనే ఆయనపై వాళ్లకున్న అభిమానాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద కంపెనీలు చాలానే ఉన్నాయి. దిగ్గజ కార్పొరేట్లూ ఉన్నారు. వార్షిక వాటాదార్ల సమావేశాలూ జరుగుతుంటాయి. అయినా ఎవరికీ దక్కని ఘనత బఫెట్ సొంతం. భారత్ ‘వారెన్ బఫెట్’గా పేరుగాంచిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పేరు తెలియని వాళ్లు మనదేశంలోనే చాలా మంది ఉన్నారు. అలాంటిది బఫెట్ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించడం మామూలు విషయం కానేకాదు. ఇక ఒమాహాలో వాటాదార్ల వార్షిక సమావేశం జరిగిన ప్రాంగణంలో పలు రకాల ఆహార పదార్థాలు, శీతల పానీయాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన వాటాదార్లు వీటిని ఒక్కోటిగా సందర్శించడంతో సందడి వాతావరణం నెలకొంది. వారెన్ బఫెట్ కూడా సమావేశానికి రావడంతోనే ఈ స్టాళ్లను సందర్శించారు. ఐస్‌క్రీమ్‌ను తింటూ, కోకాకోలాను తాగుతూ ఆయన ఒక్కో స్టాల్‌ను పరిశీలించారు. వాటాదార్లు, మీడియా ప్రతినిధులు ఆయన వెంటనే ఉండటంతో మరింత కోలాహలం నెలకొంది. అనంతరం అక్కడ నుంచి వేదికపైకి వెళ్లి వాటాదార్లనుద్దేశించి ప్రసంగించారు. 6 గంటలకు పైగా జరిగిన ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో వాటాదార్లు అడిగిన ప్రశ్నలకు బెర్క్‌షైర్ హాథ్‌వే ఛైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్, వైస్ ఛైర్మన్ చార్లీ ముంగర్ సమాధానాలిచ్చారు.
* యాపిల్‌పై: యాపిల్ నియంత్రణపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటికీ ఆ కంపెనీ షేరుపై సానుకూల ధోరణితోనే ఉన్నామని వారెన్ బఫెట్ చెప్పారు. తక్కువ ధర వద్ద మరిన్ని షేర్లను కొనుగోలు చేస్తామని తెలిపారు.
* క్రాఫ్ట్ హీంజ్పై: ఇప్పటికీ మంచి వ్యాపారమే. ఆరు- ఏడేళ్ల క్రితం క్రాఫ్ట్, హీంజ్ విడిగా ఆర్జించిన లాభాల కంటే ఇప్పుడు క్రాఫ్ట్ హీంజ్ ఆదాయాలు మెరుగ్గానే ఉన్నాయని వారెన్ అన్నారు.
* అమెజాన్‌పై: అమెజాన్ షేర్లు ఇప్పటికే బాగా పెరిగిపోయాయి కదా.. ఈ సమయంలో ఆ షేరును కొనడం లాభదాయకమైనా నిర్ణయమేనా అని ఓ వాటాదారు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ నిర్ణయాన్ని తమ ఇన్వెస్టర్ మేనేజర్లలో ఒకరు తీసుకున్నారని బఫెట్ చెప్పారు. వందల కంపెనీల షేర్లను ఇన్వెస్టర్ మేనేజర్లు నిర్వహిస్తున్నారు. అన్ని పూర్తిగా అర్థం చేసుకునే వాళ్లు నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల అమెజాన్ షేర్లు కొనడం లాభదాయకమేనని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో బఫెట్ 89వ వసంతంలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఆయన వారసుడిగా బెర్క్‌షైర్ పగ్గాలు ఎవరు చేపడతారనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. అయితే అజిత్ జైన్, గ్రెగోరి అబెల్ల్లో ఎవరో ఒకరు ఆయన వారసుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు వైస్ ఛైర్మన్ హోదాల్లో ఉన్నారు.
అమెజాన్ స్టాక్ కొనడం సరైనదే
Related tags :