మాతృ దినోత్సవం సందర్భంగా తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన ప్రేయసి నయనతారకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. లేడీ సూపర్‌స్టార్ ఓ బాబును ఎత్తుకుని ఉన్న చక్కటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘నా పిల్లలకు కాబోయే తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ఆయన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. నయన్ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అది విహారయాత్ర కోసం విదేశాలకు వెళ్లినప్పుడు తీసిన ఫొటోగా తెలుస్తోంది. త్వరలోనే వీరి పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదే సందర్భంగా నయన్ తల్లి డయనా కురియన్ను కూడా విఘ్నేశ్ విష్ చేశారు. అందమైన అమ్మాయికి జన్మనిచ్చి, గొప్ప పని చేశారని అన్నారు. నయన్ తన తల్లితో దిగిన పలు ఫొటోల్ని షేర్ చేశారు.
నయన్ పిల్లలు
Related tags :