దేశంలో కరోనా వ్యాప్తి మరింత పెరిగింది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 24 గంటల్లో 4,213 కొత్త కేసులొచ్చాయి. 97 మంది చనిపోయారు. 1,559 మంది కోలుకున్నారు. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం సోమవారానికి మొత్తం కేసులు 67,152కి చేరాయి. ఇందులో 20,917 మంది (31.14%) కోలుకోగా, 2,206 (3.28%) మంది మరణించారు. 24 గంటల్లో పెరిగిన మొత్తం కేసుల్లో 46% ఒక్క మహారాష్ట్ర నుంచే వచ్చాయి. ఒక్కరోజులోనే ఏడు రాష్ట్రాల్లో వందకుపైగా కొత్త కేసులొచ్చాయి. మొత్తం కేసుల్లో వీటి వాటా 90 శాతంగా ఉంది. తాజాగా నమోదైన 97 మరణాల్లో 54.63% మహారాష్ట్రలోనే సంభవించాయి. గుజరాత్, పశ్చిమబెంగాల్‌లుకూడా కలిపితే ఈ మూడు రాష్ట్రాల భాగం 90.72 శాతంగా ఉంది. 24 గంటల్లో 23 రాష్ట్రాల్లో ఎలాంటి మరణాలూ సంభవించలేదు. 13 రాష్ట్రాల్లో కొత్త కేసులు రాలేదు. ఇప్పటివరకూ పరీక్షలు చేసిన వారిలో 4.01% మందికి వైరస్ సోకింది.
ఇండియాలో నిన్న ఒక్కరోజే 4213 కేసులు
Related tags :