ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన అండర్-17 మహిళల ఫిఫా ప్రపంచకప్‌ను వాయిదా వేస్తూ ఇప్పటికే ఓ అధికార ప్రకటన వెలువడింది. తాజాగా ఆ టోర్నీకి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భారత్‌లో నిర్వహించనున్న అండర్-17 మహిళల ఫిఫా ప్రపంచకప్ టోర్నీ కొత్త ప్రణాళిక విడుదలైంది. ఈ టోర్నీ ఈ ఏడాది నవంబరు 2 నుంచి 21 వరకు జరగాల్సి ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా టోర్నీ నిర్వహణను 2021కు వాయిదా వేశారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు ఈ టోర్నీ నిర్వహించాలని ఫిఫా కార్యనిర్వాహక వర్గం నిర్ణయించింది. అండర్-17 మహిళల ఫిఫా ప్రపంచకప్‌ను భారత్‌లో తొలిసారి నిర్వహిస్తున్నారు. దేశంలోని కోల్‌కతా, గువహటి, భువనేశ్వర్, అహ్మదాబాద్, నవీ ముంబయిలు ఈ ప్రపంచకప్‌కు వేదిక కానున్నాయి.
2021 ఫిఫా…అయింది సఫా!
Related tags :