Movies

పవన్ పక్కన మళయాళ మానస

Manasa Radhakrishnan To Pair With Powerstar Pawan

‘గబ్బర్‌సింగ్‌’ కలయికలో మరో సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. పవన్‌ కల్యాణ్‌ 28వ చిత్రమిది. ‘ఇప్పుడే మొదలైంది…’ అంటూ ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చబోతున్నారని సోమవారమే ప్రకటించారు దర్శకుడు హరీష్‌శంకర్‌. అలాగే కథానాయిక ఎంపికపై కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇందులో పవన్‌ సరసన మలయాళ భామ మానస రాధాకృష్ణన్‌ నటించే అవకాశాలున్నాయి. చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. మానస మలయాళంతో పాటు తమిళంలోనూ నటిస్తున్నారు.