చేసింది తక్కువ సినిమాలే అయినా, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. వరుస విజయాలు, ఆమెకు మంచి అవకాశాల్ని తీసుకొస్తున్నాయి. తెలుగుతో పాటు కన్నడలోనూ సినిమాలు చేస్తోంది. ‘మీ ప్రయాణం ఎలా సాగుతోంది’ అని ఆమెను అడిగితే… ‘‘ఎప్పుడైతే ఈ రంగంలోకి అడుగుపెట్టానో, అప్పటి నుంచీ తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నాను. ఇష్టమైన పనిని, ఇష్టమైన వ్యక్తులతో కలసి చేస్తున్నప్పుడు పొందే ఆనందం ఎలాంటిదో అనుభవిస్తున్నాను. నాకొచ్చే అవకాశాలు, పాత్రలు సంతృప్తికరంగానే ఉన్నాయి’’ అంటోంది. గ్లామర్ పాత్రల గురించి తన అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తూ ‘‘నేను చేస్తున్నవన్నీ టీనేజ్ పాత్రలే. నా వయసూ అలాంటిదే. అలాంటప్పుడు గ్లామర్‌గా కనిపించడంలో తప్పేంటి? తెర రంగుల హరివిల్లులా ఉంటేనే ప్రేక్షకులు ఇష్టపడతారు. అందులో నేనో రంగుని మాత్రమే. అందాల ప్రదర్శనకు ఓ హద్దు అంటూ ఉంటుంది. దాన్నిగుర్తెరిగి నడుచుకోవాలంతే’’ అంది రష్మిక.
అనుభవిస్తున్నాను
Related tags :