తన పేరు, తన నిర్మాణ సంస్థ పేరుని అనధికారికంగా వాడుకున్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అగ్రకథానాయకుడు సల్మాన్‌ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతా వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. సల్మాన్‌ఖాన్‌కు చెందిన సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ఓ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసుకుంటోందని సోషల్‌మీడియాలో కొంతకాలం నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఎస్‌కేఎఫ్ పేరుతో ఆడిషన్స్ కోసం రమ్మని పలువురికి మెస్సేజ్‌లు కూడా వెళ్లాయి. దీంతో ఈ విషయం కాస్తా సల్మాన్‌ఖాన్ దృష్టికి వెళ్లడంతో తాజాగా ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.
నా పేరు వాడితే కేసు పెడతా
Related tags :