NRI-NRT

అమెరికాంధ్రాల్లో నాట్స్ వితరణ

NATS Helps Poor And Police In Andhra And America

గుంటూరు జిల్లాలోని 200 మంది పేద కుటుంబాలకు నిత్యావసరాలను నాట్స్ పంపిణీ చేసింది. నాట్స్ ఛైర్మన్ అప్పసాని శ్రీధర్ స్వగ్రామం వేటపాలెంతో పాటు కొత్తపల్లి, నారికేళ్లపల్లి గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానికులు అప్పసాని రాజేష్ , రావిపాటి బాబు, రావిపాటి వెంకటేశ్వరరావు తదితరులు సహకరించారు.

నాట్స్ మాజీ ఛైర్మన్ శ్యామ్ మద్దాళి న్యూజెర్సీ పోలీసులకు ఉచితంగా గౌన్లు, మాస్కులు అందజేశారు. న్యూజెర్సీ పరిసర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు ఆయన ఇప్పటికే ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు.