ఓ నీట్ పరీక్షా కేంద్రం దగ్గర కెమేరా కంటికి చిక్కిన దృశ్యమిది. ఓ విద్యార్థిని ముక్కుపుడక చేత్తో తీయడానికి రాకపోయేసరికి, ఇలా కటింగ్ ప్లేయర్‌తో తొలగించారు. మరికొందరు విద్యార్థులు పొడుగు చొక్కాలతో రావడంతో… లోనికి అనుమతించేది లేదని సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో చేసేది లేక చొక్కాలు కత్తిరించుకుని వచ్చారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 80వేల మంది విద్యార్థులు నీట్‌కు హాజరయ్యారు. చాలా చోట్ల హడావుడి వాతావరణమే కనపడింది. ఉరుకులు పరుగులతో ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చిన విద్యార్థులు.. నీట్ నిబంధనలతో కాస్త గందరగోళానికి గురయ్యారు. వైద్య విద్యలో ప్రవేశాలకుగాను నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కఠిన నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. పొడుగు చేతుల చొక్కాలు, బూట్లు, ఎత్తు మడమల చెప్పులు, చేతి గడియారాలు, బంగారు, వెండి ఆభరణాలు ధరించవద్దని.. మంచినీళ్ల సీసా, పెన్ను, పెన్సిల్, స్కేలు, క్యాలిక్కులేటర్, ప్యాడ్, ఎరేజర్‌కు కూడా అనుమతిలేదని స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద వస్తువులను భద్రపరిచేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయబోమని, అనుమతిలేని వస్తువులను ముందుగానే నివారించాలని సీబీఎస్ఈ హెచ్చరించింది.
“నీట్” విద్యార్థిని ముక్కుపుడకను కటింగ్ ప్లేయర్‌తో తీసేసి…
Related tags :