Agriculture

డబ్బులు రాని రైతులు ఈ నెంబరుకు కాల్ చేయండి

Farmers That Did Not Receive PM Kisan Yojana Money Can Call This

పీఎం కిసాన్ యోజన నగదు జమ కాలేదా..? ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు..!

కరోనా లాక్‌డౌన్ కారణంగా పతనమైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం విదితమే.

అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎప్పటికప్పుడు మీడియాతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఏయే రంగాలకు ప్యాకేజీని ఎలా ఖర్చు చేయనుందీ వివరిస్తూ వస్తున్నారు.

ఇక రైతులకు కూడా ఆ ప్యాకేజీలోంచి కొంత మొత్తం ఖర్చు చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో భాగంగా పీఎం కిసాన్ యోజన పథకం కింద దేశంలోని 9.13 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,253 కోట్లను ఇప్పటికే జమ చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు.

అయితే రైతులు తమ ఖాతాల్లో నగదు జమ కాకపోతే..
తమ గ్రామంలోని పంచాయతీ శాఖ అధికారులు లేదా జిల్లా అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు.

ఇక పీఎం కిసాన్ యోజన పథకం కింద నగదు జమ కాని వారు కింద తెలిపిన ఫోన్ నంబర్లకు కూడా కాల్ చేసి సమస్యను తెలపవచ్చు.

1. 155261
2. 0120-6025109
3. 1800115526 (టోల్ ఫ్రీ నంబర్‌)