జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి అని తెలిసిందే. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఈ నియమాన్ని పెట్టింది. కానీ ఇంకా చాలా వరకు వాహనాలు ఫాస్టాగ్ లేకుండానే హైవేలపై తిరుగుతున్నాయి. ఫాస్టాగ్‌లేని వాహనాలకు ఇక నుంచి టోజ్ ప్లాజాల వద్ద రెట్టింపు రుసుము వసూల్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇవాళ రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఫాస్టాగ్ లేకున్నా.. లేదా సరిగా పనిచేయని ఫాస్టాగ్ ఉన్నా.. అట్టి వాహనాలు టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్ లేన్‌లోకి ప్రవేశించరాదు. ఒకవేళ ఆ వాహనాలు ఫాస్టాగ్ లేన్‌లోకి వస్తే, ఆ వెహికిల్ క్యాటగిరీ టోల్ ఫీజును రెండు రెట్లు ఎక్కువగా వసూల్ చేయనున్నారు.
ఫాస్టాగ్ లేకపోతే భారీ జరిమానా
Related tags :