Editorials

మే 31 వరకు లాక్‌డౌన్ నిబంధనలు ఇవే

Lock Down Policies Rules And Restriction Until May 31 In India

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం ఆదివారం సాయంత్రం లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను జారీ చేసింది.

విమాన, మెట్రో సర్వీసులకు అనుమతి లేదని, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌ను అనుమతించబోమని స్పష్టం చేసింది.

కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలకే అనుమతిస్తామని పేర్కొంది. 

కరోనా కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే రాష్ట్రాలపై చర్యలు చేపడతామని పేర్కొంది.

హాట్‌ స్పాట్స్‌ కేంద్రాల్లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని సూచించింది. 

బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

అలాగే కరోనా నియంత్రణ చర్యల్లో రాష్ట్రాలు కఠినంగా ఉండాలని, పాజిటివ్‌ కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే రాష్ట్రాలపై కఠినంగా వ్యవహరించేందుకు వెనుకాడబోమని కేంద్రం సంకేతాలు ఇచ్చింది.

లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలు..

మే 31 వరకూ విద్యాసంస్ధల మూసివేత 

రాజకీయ, సామాజిక సభలపై నిషేధం కొనసాగింపు

స్కూళ్లు, సినిమాహాల్స్‌, హోటల్స్‌కు నో పర్మిషన్

విమాన సర్వీసులకు అనుమతి లేదు

రాష్ట్రాల అనుమతులతో బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణాలకు అనుమతి

రాష్ట్ర పరిధిలో బస్సు సర్వీసులు, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణాలపై రాష్ట్రాలదే తుది నిర్ణయం

రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్వ్యూ నిబంధనలు అమలు

65 ఏళ్లు దాటినవారు, గర్భిణి మహిళలు, 10 ఏళ్ల లోపు చిన్నారులు ఇళ్లకే పరిమితం

కంటైన్‌మెంట్‌జోన్లలో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి

రెడ్‌, గ్రీన్, ఆరెంజ్‌ జోన్‌ల గుర్తింపు జిల్లా అధికారులదే

కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలు కఠినతరం