కరోనా మహమ్మారి వైరస్ దేశంలో రోజు రోజుకు విజృంభిస్తున్నది. ఇక మహారాష్ట్ర లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్నది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా మొత్తం అన్ని చోట్లా మహారాష్ట్ర ను పట్టి పీడిస్తున్నది. ఈ క్రమంలో నే ముంబై లోని అర్తుర్ రోడ్ లో గల జైలు లో వంద మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ రావడంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60 జిల్లాలలో ఇప్పుడు 7200 మంది ఖైదీలను టెంపరరీ బెయిల్, పెరోల్ పై విడుదల చేస్తున్నట్టు అదే విధంగా మరో పది వేల మంది ఖైదీలను కూడా ఇదే విధంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. జైళ్లలోమొత్తం మహారాష్ట్ర లో జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సంఖ్య 35 వేలు కాగా ఇందులో ఏడేండ్లు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం ప్రభుత్వం ఒక అత్యున్నత కమిటీ ని నియమించింది.
మహారాష్ట్ర జైళ్ల నుండి 7200 ఖైదీల విడుదల
Related tags :