వర్క్ ఫ్రమ్ హోమ్ మంచిది కాదు మైక్రోసాఫ్ట్ సీఈఓ..
లాక్ డౌన్ కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు మరియు ఆఫీస్ లు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి.
ఇక అన్ని దేశాల్లో లాక్ డౌన్ లో సడలింపులు చేస్తున్నారు. దీంతో కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్ కు రావాలని చెబుతున్నారు.
అయితే ట్విట్టర్ మాత్రం దానికి బిన్నంగా ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నామని ప్రకటించింది.
దీంతో అన్ని కంపెనీలు దాదాపు ఇదే బాట పడతాయని భావించారు.
అయితే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల దీనికి విరుద్ధంగా స్పందించారు. శాశ్వతంగా ఇంటి నుండి పని కల్పించడం మంచిది కాదని అన్నారు.
ఉద్యోగుల మానసిక స్థితిపై కూడా ఇది ప్రభావం చూపుతుందన్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ తో పరస్పర సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందన్నారు.
వీడియో కాల్స్ ఎప్పటికీ వ్యక్తిగత సమావేశాలను భర్తీ చేయలేవని అభిప్రాయం వ్యక్తం చేసారు.
శాశ్వతమగా ఇంటి నుండి పని చేయటంతో ఉద్యోగులే కాకుండా కంపెనీలు కూడా ఇబ్బంది పడతాయన్నారు.