కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తిప్పికొట్టారు. మీడియా సమావేశంలో కేసీఆర్ వాడిన భాష సరిగా లేదని ఆక్షేపించారు. సంస్కరణల్లో భాగంగా ఒకే దేశం- ఒకే గ్రిడ్ విధానం అమలు కావాల్సిందేనన్నారు. తాత్కాలికమైన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ కష్ట సమయంలో ఆలోచన చేయడం సరికాదన్నారు. దేశ హితం కోసం తెచ్చిన ఆర్థిక ప్యాకేజీ అన్ని రాష్ట్రాలకు ఉపయోగకరమన్నారు. ప్రధాని మోదీ హయాంలో ఒక్క రూపాయి దుర్వినియోగమైందా అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. గత విధానాల్లో మార్పుల కోసమే అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. పరిశ్రమల స్థాపన… నైపుణ్య శిక్షణ ఇవ్వకపోతే మరో 70 ఏళ్లయినా దేశం ఇలాగే ఉంటుందన్నారు. కేంద్రం ప్రకటించిన రూ.21లక్షల కోట్ల ప్యాకేజీతో తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతోందో కేసీఆర్ వివరించాలన్నారు. తాము తప్ప ఏపార్టీ ఉండకూడదనే సంకుచిత ధోరణిలో సీఎం ఉన్నారు…కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నారని కిషన్రెడ్డి విమర్శించారు.
కేసీఆర్…ఏంది ఆ భాష?
Related tags :