సుమారు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. 56 రోజుల కరోనా లాక్‌డౌన్ సడలింపుల అనంతరం మంగళవారం హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా సందడి నెలకొంది. ప్రజలు తమ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ నాటి నుంచే డిపోలకు పరిమితమైన బస్సులు మంగళవారం రోడ్డెక్కాయి. రాష్ట్రమంతటా ఆటోలు, క్యాబ్‌లకు అనుమతించడంతో హడావుడి కనిపించింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు, వరంగల్ అర్బన్ జిల్లాలు మినహా మిగిలినచోట్ల పది రోజుల క్రితమే నిబంధనలను సడలించారు. మంగళవారం నుంచి అనుమతి పొందిన పలు దుకాణాలను పునఃప్రారంభించారు. పలు పట్టణాల్లో మంగళవారం షాపులను పూర్తిగా తెరిచారు. హైదరాబాద్ సహా చుట్టుపక్కల సోమవారం దాకా నిబంధనలు కొనసాగాయి. మంగళవారం నుంచి పూర్తిగా నిబంధనలు సడలించడంతో జనం భారీగా బయటకు వచ్చారు. మాస్కులు ధరించి.. వ్యక్తిగత రక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు.
హైదరాబాదీల సందడే సందడి
Related tags :