ఆర్టీసీ ఎండి మాదిరెడ్డి ప్రతాప్ విలేకరుల సమావేశం
భౌతిక దూరం పాటించడానికే బస్సులో సీట్లు మార్పు….
బస్సులో టికెట్లు అమ్మబడవు…
నగదురహిత విధానం…
అత్యవసరమైతే తప్పితే చిన్న పిల్లలు, 60 సంవత్సరాలు దాటిన వారికి బస్సులో ప్రవేశం ఉండదు…
ప్రయాణం చేసేటప్పుడు ఆరోగ్య సేతు యాప్ కంపల్సరిగా ఉండాలి..
ముందస్తు చర్యల్లో భాగంగా బస్సులో ప్రయాణం చేసిన ప్రయాణికుల డేటా మొత్తం భద్రపరచడం జరుగుతుంది…
ఇప్పటికి లాక్ డౌన్ విధించి 58 రోజులయ్యింది.
కొన్ని ప్రత్యేక సర్వీసులు మినహా అప్పటి నుండీ ఏపీలో ఋట్ఛ్ నడవడం లేదు.
ఏనాటికన్నా ఋత్ఛ్ రోడ్డు ఎక్కే శుభ గడియ వస్తుంది అని చాలా రోజులుగా ప్రిపేర్ అవుతున్నాం.
చైనాలో బీజింగ్.. షాంఘాయ్ లాంటి ప్రాంతాల్లో బస్సులు నడుపుతున్న పద్దతి గమనించాం
కండక్టర్ ను పడితే అతను ఒక సూపర్ స్ప్రెడర్గా మారే ప్రమాదం ఉంది.
కాబట్టి ఆన్ బోర్డ్ కండక్టర్ లేకుండానే బస్సులు నడపాలి.
బస్సులో పక్క పక్కనే సీట్లు ఉంటాయి. కాబట్టి అది ప్రమాదం అని సీటింగ్ ఎరేంజ్ మెంట్ చేశాం.
అది కూడా తక్కువ ఖర్చుతో చేశాం.దానికి బస్సు కోసం పదివేలు మాత్రం ఖర్చు పెట్టాము.
పల్లె వెలుగు లాంటి బస్సుల్లో ఏయే కుర్చీల్లో కూర్చోకూడదో..అలాంటి చోట్ల రెడ్ మార్క్ వేశాం.
బస్సుల్లో వెళ్లే వాళ్ళు మాస్కులు ధరించడం తప్పనిసరి.
బస్ స్టాండ్ ల్లో స్టాళ్లన్నింటిలో మాస్కులు సిద్ధంగా ఉండాల్సిందే. అదికూడా 10 రూపాయలకు మించకుండా రేపటి నుండీ బస్సు సర్వీసులు ప్రారంభిస్తున్నాం.
సిటీ బస్సు సర్వీసులు తరువాత ప్రారంభిస్తాం.
అంతర్రాష్ట్ర సర్వీసులుపై నిషేధం.
నైట్ జర్నీ కూడా పెడుతున్నాము.
రాత్రిపూట కర్ఫ్యూ ఉంటుంది..అయినా వేసవి కాలం దృష్టి లో పెట్టుకుని రాత్రి పూట బస్సులు నడుపుతాం.
కానీ బస్ స్టాండ్ కి రాత్రి 7 లోపు చేరుకోవాలి.
క్రెడిట్ కార్డు..డెబిట్ కార్డు..గూగుల్ పే లాంటి అన్ని రకాల వేలెట్ ల ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
65 ఏళ్ళు దాటిన వాళ్ళు..10 ఏళ్ల లోపు పిల్లలను.. అత్యవసర మైతేనే (మెడికల్ ఎమెర్జెన్సీ) బస్సులో అనుమతిస్తాం.
ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని అ/చ్ బస్సులు నడుపుతాం.కానీ దుప్పట్లు ఇవ్వం.
ఆ/ఛ్ 26 డిగ్రీలతో మాత్రమే నడుపుతాం.
చార్జీలు పెంచట్లేదు.
రేపు ఉదయం 7 గంటలకు తొలి బస్సు సర్వీస్ ప్రారంభిస్తున్నాం.
ఇంతకు ముందు లా ట్రావెల్ ఆపరేషన్ చేయలేం.
నెమ్మదిగా ఆర్ధిక వృద్ధి పెంచే దిశగానే బస్సు సర్వీసులు పెంచుతున్నాం.
కాబట్టి 17% సర్వీసులు.. అంటే 1683 బస్సులు మాత్రమే ప్రారంభిస్తున్నాం.
ఈ రెండు నెలల లాల్ డౌన్ కారణంగా ర్త్చ్ కి 1200 కోట్ల రూపాయల వరకూ నష్టం వచ్చింది.