బయో డైవర్సిటీ జంక్షన్‌లో మొదటి లెవల్‌పై ఏర్పాటు చేసిన ఫ్లై ఓవర్‌ను గురువారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
రూ. 30.26 కోట్ల వ్యయంతో ఈ ఫ్లై ఓవర్ నిర్మించారు.
గచ్చిబౌలి నుంచి రాయదుర్గం మీదుగా వెళ్లే వాహనదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు.