సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యూకేషన్ 10వ తరగతి ఫలితాలను సోమవారం మద్యాహ్నం విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా 91.1 శాతం మంది విద్యార్థులు ఇందులో ఉత్తీర్ణత సాధించారు. వాస్తవానికి ఈ ఫలితాలు సాయంత్రం 3 గంటలకు విడుదలవ్వాల్సి ఉండగా.. మరికొంత సమయం ముందుగానే ప్రకటించారు. ఆదివారమే ఫలితాలు ప్రకటిస్తారని తొలుత వార్తలు వెలువడ్డాయి. సీబీఎస్ఈ అధికారులు దాన్ని తోసిపుచ్చారు. ఆదివారమే ఫలితాలు వెలువడతాయని వచ్చిన వార్తల్ని సీబఎస్‌ఈ అధికారులు తోసిపుచ్చారు.కాగా ఈ పరీక్షల్లో కేరళ రాజధాని త్రివేండ్రం విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఏకంగా 99.85 శాతం ఉత్తీర్ణతతో దేశంలో అగ్రగామిగా నిలిచారు. ఇకపోతే దేశవ్యాప్తంగా 91.1 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోల్చుకుంటే 4.40 శాతం ఈసారి అధిక ఉత్తీర్ణత సాధించినట్లు తెలుస్తోంది. 2017లో పదవ తరగతిలో 93.06 శాతం ఉత్తీర్ణత నమోదైంది.ఇదే పరీక్షలో 13 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. మొత్తం 500 మార్కులకు గాను 499 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు.
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు
Related tags :