Food

గోరుచిక్కుడులో పోషకాలు బోలెడు

Telugu Food And Diet News-Cluster Beans Are Good For You

* గోరుచిక్కుడులో పిండిపదార్థాలు తక్కువగా.. ప్రొటీన్లు, కొవ్వు, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌-ఎ, సి, కెలు పుష్కలంగా ఉంటాయి. దీంట్లోని జిగురుకు ఔషధ గుణాలుంటాయి. ● రక్తంలో చిక్కదనం పెరిగినప్పుడు తీసుకుంటే గోరుచిక్కుడు ఔషధంలా పనిచేస్తుంది. కొవ్వును కరిగించడానికి సహాయ పడుతుంది.

* ఇందులో పీచు అధికంగా ఉండటంతో మలబద్ధక సమస్యను పరిష్కరించే గుణం ఉంటుంది.

* గర్భిణులు గోరుచిక్కుడును ఆహారంలో భాగం చేసుకుంటే గర్భస్థ శిశువు పెరుగుదలకు తోడ్పడుతుంది.

* గింజలు ఎక్కువగా ఉన్న గోరుచిక్కుడు తింటే బరువు తగ్గుతారు.

* కొలెస్ట్రాల్‌ సమస్యలను తగ్గిస్తుంది. మధుమేహ పీడితుల్లో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో ఎముకలకు బలం.

* గోరుచిక్కుడు గింజలను ఎండబెట్టి పొడిచేసి కూరల్లో వేసుకోవచ్ఛు వీటి ఆకులను పప్పులో కలిపి వండుకోవచ్చు.

* ప్రయోజనాలెన్ని ఉన్నా గోరుచిక్కుడు అతిగా తీసుకుంటే అజీర్తి చేస్తుంది. మితంగానే తీసుకోవాలి