Movies

సంగీత దర్శకురాలిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీలేఖ

MM Sreelekha Celebrates 25 Years Of Music Directorship

ఈ ఫోటో నేను తాజ్‌మహల్ సినిమా చేసినప్పుడు తీసిన ఫోటో.. సరిగ్గా ఇవాళ్టికి 25 సంవత్సరాలు అయ్యింది ఈ సినిమా రిలీజ్ అయ్యి…అప్పుడే అన్ని సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది ఏదో నిన్నో మొన్నో రికార్డింగ్ చేసినట్టుగా ఉంది…అది నా కెరీర్లో నాల్గవ సినిమా…ప్రతీ పాట ప్రతీ సీన్ ఎంజాయ్ చేస్తూ చేశాను.. ఇప్పటికి ఆ జ్ఞాపకాలు మర్చిపోలేను…నా జీవితానికి ఒక పూల బాట వేసిన సినిమా తాజ్‌మహల్…మంచుకొండల్లోన చంద్రమా అనే పాటతో కంపోజింగ్ స్టార్ట్ అయ్యింది… అద్భుతమైన ప్రేమ కధా చిత్రం అప్పుడు నా వయసు, నా మేధస్సు ఆ సినిమా చెయ్యడానికి సరిపోదు అయినా మరి నన్ను నమ్మి ఆ సినిమా నాకు ఇచ్చిన నా గాడ్ ఫాథర్ మూవీ మొఘల్ రామానాయుడు గారికి ఎన్ని జన్మలైనా ఋణం తీర్చుకోలేను.. అయన మనతో లేరన్న నిజం ఇప్పటికి తట్టుకోలేక పోతున్నాను అయన చివరి సినిమా కూడా నేనే చేశాను…తాజ్‌మహల్ మూవీ డైరెక్టర్ ముప్పలనేని శివ గారు.. కెమెరా చోట కే నాయుడు గారు.. హీరో శ్రీకాంత్ గారు.. సంఘవి, మోనికాబేడీ.. శ్రీహరి గారు.. అలాగే నా పాటలకు ప్రాణం పోసిన చంద్రబోస్ గారు భువనచంద్ర గారు ..బాలు గారు, చిత్రమ్మ.. ఈ సినిమా నాకు చెయ్యడానికి అవకాశం ఇచ్చిన అందరికి అలాగే ఈ సినిమాని ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు సంగీత అభిమానులకు ఈ సిల్వర్ జూబిలీ సందర్భంగా నా కృతజ్ఞతలు….
మీ MM శ్రీలేఖ