Business

ఇవాళ ఒక్కరోజే 2.4లక్షల లడ్డూల అమ్మకం

2.4Lakhs Laddus Sold In 3Hours In Telugu States

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా తితిదే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు కేవలం 3 గంటల్లోనే 2.4 లక్షల లడ్డూల విక్రయం జరిగింది. గుంటూరు మినహా 12 జిల్లాల్లో లడ్డూ ప్రసాదాలను తితిదే అందుబాటులోకి తీసుకొచ్చింది. గుంటూరులోని తితిదే కల్యాణమండపం రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నందున లడ్డూల విక్రయానికి పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో లడ్డూ ప్రసాదం కోసం ఆశగా వచ్చిన భక్తులు వెనుదిరగాల్సి వచ్చింది. మరోవైపు, ఈ నెల 30 నుంచి గుంటూరులో లడ్డూ ప్రసాదాలు విక్రయించనున్నారు. రేపు మరో 2లక్షల లడ్డూలను జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. లడ్డూలు విక్రయించాలని తమిళనాడు, తెలంగాణ భక్తుల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో ప్రతి రోజు తమిళనాడుకు లక్ష, తెలంగాణకు 50వేల చొప్పున లడ్డూలు తరలించేందుకు తితిదే యోచిస్తోంది.