Devotional

యాదాద్రి గర్భగుడిలోకి ప్రభుత్వాధికారులు

R&B Officers Enter Yadadri Garbhagudi Shattering Protocol

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి గర్భాలయంలోకి ఆర్‌అండ్‌బీ అధికారులు, ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించారు. యాదాద్రి ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో స్వయంభువులు కొలువైన గర్భాలయంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. అయితే, సోమవారం గర్భాలయంలో స్వయంభువులకు అర్చకులు నిత్య పూజలు నిర్వహించేందుకు వెళ్లారు. అదే సమయంలో యాదాద్రి ఆలయ విస్తరణ పనుల పరిశీలనకు వచ్చిన ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రామకృష్ణారావు, ఇతర అధికారులు గర్భాలయంలోకి ప్రవేశించారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నించగా.. పనుల పరిశీలనలో భాగంగానే గర్భాలయంలోకి వెళ్లినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఈవో గీతారెడ్డి తెలిపారు.