కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో రెండు నెలలు స్పెయిన్‌లో చిక్కుకుపోయిన నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ ఎట్టకేలకు మాతృదేశం సెర్బీయాకు చేరుకున్నాడు. స్పెయిన్‌లో ఉన్న తన సోదురుడిని చూసేందుకు కుటుంబంతో సహా జకోవిచ్ మార్చిలో అక్కడికెళ్లిన సంగతి తెలిసిందే. తర్వాత లాక్డౌన్ విధించడంతో టెన్నిస్ దిగ్గజం అక్కడే ఉండిపోయాడు. తాజాగా ఆయన సెర్బియా చేరుకోగానే తన టెన్నిస్ కాంప్లెక్స్‌లో మీడియాతో మాట్లాడాడు. లాక్డౌన్ వేళ తాను ఫిట్‌గానే ఉన్నాననీ, ప్రతీ రోజూ టెన్నిస్ కోర్టులో ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. ఈ విరామ సమయంలో తన సాధనకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, తామున్న మార్బెల్లా రిసార్ట్‌లో టెన్నిస్ కోర్టు ఉందన్నాడు.
లాక్డౌన్లో సాధన చేశాను
Related tags :