విలక్షణ నటుడు కమల్ హాసన్, నటి పూజా కుమార్ డేటింగ్లో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు కలిసి ‘విశ్వరూపం’, ‘ఉత్తమ విలన్’, ‘విశ్వరూపం 2’లో నటించారు. కమల్తోనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులతోనూ పూజా కుమార్ స్నేహంగా ఉంటున్నారు. కమల్ ఫ్యామిలీ వేడుకల్లో పూజా కుమార్ కూడా పలుమార్లు కనిపించారు. అయితే డేటింగ్ వదంతులపై పూజా కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘చాలా ఏళ్లుగా నాకు కమల్, ఆయన కుటుంబం తెలుసు. ఆయనతో కలిసి నటించినప్పటి నుంచి కుటుంబ సభ్యులకు కూడా దగ్గరయ్యా. ఆయన సోదరుడు, ఇద్దరు కుమార్తెలు శ్రుతిహాసన్, అక్షరా హాసన్.. అందరూ నాకు సుపరిచితమే. అందుకే వాళ్ల ఫ్యామిలీ ఫంక్షన్లలో నేను కనిపిస్తుంటా’ అని ఆమె సమాధానం ఇచ్చారు.
ఫ్యామిలీ ఫ్రెండ్ అంతే!
Related tags :