Movies

ముద్దు కోసం అనుమతి అడిగాడు

Bhagyasree on her experiences about mein ne pyaar kiya

‘‘మైనే ప్యార్‌ కియా’ నాకెంతో మంది అభిమానులను అందించింది. ఆ సినిమా విడుదల సమయంలో నేను, సల్మాన్‌ జంటగా పలు ఫొటోషూట్స్‌లో పాల్గొనేవాళ్లం. అయితే ఓ ఫేమస్‌ ఫొటోగ్రాఫర్‌ ఓ రోజు మా ఇద్దరిపై ఫొటోషూట్‌ చేసేందుకు వచ్చారు. ఆయనకు కొంచెం హాట్‌ ఫొటోగ్రాఫ్స్‌ కావాలి. అందుకనే ఫొటోషూట్‌కు ముందుకు సల్మాన్‌ను పక్కకి పిలిచి.. ‘సర్‌, మీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు కావాలి. నేను కెమెరా సెట్‌ చేయగానే మీకు చెబుతా. మీరు వెంటనే భాగ్యశ్రీని ముద్దుపెట్టుకోండి’ అని చెప్పారు. ఆ సమయంలో నేను వాళ్ల వెనుకే ఉన్నాను. కానీ అది వాళ్లు గమనించలేదు. ఫొటోగ్రాఫర్‌ మాటలు విని నాకెంతో భయంగా అనిపించింది. ‘మీరు కోరిన విధంగా నేను అలాంటి పని చేయను. మీకు ఒకవేళ అలాంటి పోజ్ కావాలి అనుకుంటే ముందు మీరు భాగ్యశ్రీ అనుమతి తీసుకోండి.’ అని సల్మాన్‌ అన్నారు. సల్మాన్‌ చెప్పిన సమాధానంతో ఆయనపై గౌరవం పెరిగింది. మంచి వ్యక్తుల మధ్యే ఉన్నానని ఎంతో ఆనందించాను.’ అని భాగ్యశ్రీ తెలిపారు.