Politics

జైలుపక్షివి నువ్వు కూడా అడిగేవాడివా?

Kesineni Nani Slams Vijayasai Reddy

ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ఈరోజు విమర్శల దాడిని పెంచారు. ఎన్టీఆర్ జయంతినాడు ఆయన విగ్రహం కళ్లలోకి చూసే దండ వేశావా చంద్రబాబూ అని ప్రశ్నించిన విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. ‘వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకుని, 16 నెలలు జైల్లో ఉన్నావు కదా. నీ జీవితంలో ఒక్కసారైనా పశ్చాత్తాపానికి గురయ్యావా?’ అని సెటైర్ వేశారు.ఇప్పట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం కష్టమని… కేంద్రం మనపై ఆధారపడే పరిస్థితి వచ్చినపుడే అది సాధ్యమవుతుందనని జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై కేశినేని నాని స్పందిస్తూ, ‘నాకు ఓట్లు వేయండి. అధికారంలోకి వస్తే చించేస్తా, పొడిచేస్తా… మాట తప్పకుండా, మడమ తిప్పకుండా, వెన్ను చూపకుండా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రగల్బాలు పలకావు. ఇప్పుడు చేతులెత్తేశావేంటి ఉత్తరకుమారా?’ అని ఎద్దేవా చేశారు.