Fashion

లినెన్ చీరలు ఇప్పుడు వేసవిలో అందమైన ఫ్యాషన్

Linen Saree Fashion In Summer In India

మండే ఎండల్లోనైనా..పండు వెన్నెల్ని కురిపిస్తుంది లినెన్‌ క్లాత్‌!సమ్మర్‌ ఫ్రెండ్లీ. కూల్‌గా ఉంటుంది. చర్మానికి బ్రీతింగ్‌ ఇస్తుంది. అంతే కాదు.. మంచి లుక్‌ వస్తుంది. లినెన్‌ ఫ్యాబ్రిక్‌ ఫ్యాషన్‌ ఇండస్ట్రీ రూపురేఖల్నే మార్చేసింది. వాతావరణానికి అనుగుణంగా మేనికి హాయినిస్తుంది. చమటను పీల్చుకుంటుంది. దీర్గకాలం మన్నుతుంది. ధరించినవారిని హుందాగా చూపుతుంది. ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎన్నో సొబగులు అద్దుకున్న లినెన్‌ అతివలను చీరలతో మరింత అందంగా చూపుతుంది. ఇన్ని సుగుణాలు ఉన్న లినెన్‌ ఫ్యాబ్రిక్‌కి నాలుగువేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా డెభ్బైల కాలంలో ఐదుశాతంగా ఉన్న లినెన్‌ ఉత్పత్తులు, తొంభైల కాలం వచ్చేసరికి డెభ్బై శాతానికి పైగా పెరగింది. ఖరీదులోనూ ఘనంగా ఉండే లినెన్‌ తయారీలో ఎన్నో మార్పులు చోటు చేసుకొని ఇప్పుడు అందరికీ అందుబాటు ధరల్లోకి వచ్చాయి. ప్లెయిన్, చెక్స్, షేడెడ్‌ కలర్స్, సెల్ఫ్‌ బార్డర్స్‌తో కనువిందు చేసే లినెన్‌ చీరలు ముఖ్యంగా వేసవిలో తమ తమ హుందాతనాన్ని చాటుతున్నాయి. ఈ చీరల మీదకు డిజైనర్, సెల్ఫ్‌బ్లౌజులు.. వేటికవి ప్రత్యేకంగా కనిపిస్తాయి.