Politics

ఏపీ ఎన్నికల కమీషన్‌లో నూతన మహిళా అధికారి

G Vanimohan Appointed As AP Election Commission Secretary

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా జి.వాణీమోహన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె సహకారశాఖ కమిషనర్‌గా ఉన్నారు. ఎన్నికల కమిషనర్‌ కార్యదర్శితో పాటు సహకార శాఖ కమిషనర్‌, ఏపీ డెయిరీ అభివృద్ధి సమాఖ్య ఎండీగా, పురావస్తు, మ్యూజియంల శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.