బంగాళాదుంపలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయన్న కారణంతో చాలామంది దాన్ని పక్కన పెట్టేస్తుంటారు. కానీ అందులో కొద్దిపాళ్లలో ఉండే ఓ ప్రొటీన్, కండరాల్లో మరింత ప్రొటీన్ ఉత్పత్తికి కారణమవుతుందని మెక్మాస్టర్ విశ్వవిద్యాలయ నిపుణులు పేర్కొంటున్నారు. వెయిట్ లిఫ్టర్లూ భుజబలం కావాలనుకునేవాళ్లూ ప్రొటీన్కోసం ఇష్టం లేకున్నా ఎక్కువగా మాంసాహారంమీదే ఆధారపడుతుంటారు. కానీ అవసరం లేదనీ శాకాహారమైన బంగాళాదుంపలోని ప్రొటీన్ కూడా వాళ్లకి సరిపోతుందనీ అంటున్నారు సదరు నిపుణులు. ఇందులో ప్రొటీన్ కొద్దిపాళ్లలోనే ఉండొచ్చు కానీ అది కండరాల్లో ప్రొటీన్ ఉత్పత్తికి దోహదపడుతుందనీ పైగా ఆరోగ్యానికీ మంచిదనీ చెప్పుకొస్తున్నారు.
మాంసం బదులు దుంపలు
Related tags :