DailyDose

విజయవాడలో కబ్జా భూమి కోసం హత్యాయత్నం-నేరవార్తలు

Telugu Crime News Roundup Today - Murder Attempts In Vijayawada

* పటమటలో రెండు గ్రూపుల మధ్య వివాదం. మాజీ రౌడీషీటర్‌ జోక్యం చేసుకున్నట్లు సమాచారం. రాజకీయ పార్టీల నేతల అనుచరుల ప్రమేయం? కొందరు విద్యార్థులకు గాయాలు.

* గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో విషాదం…పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన యువకుడు అనూష్(23) చికిత్స పొందుతూ మృతి

* కరోనా వైరస్​ నిబంధనలు ఉల్లఘించినందుకు రొమేనియా ప్రధాని లుడోవిక్​ ఆర్బన్​ 600 డాలర్ల జరిమానా చెల్లించారు.

* శ్రీకాకుళంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పందిగుంటలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.

* చిత్తూరు జిల్లా, బైరెడ్డి పల్లి మండలం జంగాల అగ్రహారంలో ఫాస్టర్ రాజకుమార్ అనే యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడని అదే గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే యువతి పోలీసులకు పిర్యాదు చేసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతని చేసి అబార్షన్ చేయించాడని పిర్యాదులో పేర్కొంది.

* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాస ప్రాంతంలో రౌడీ షీటర్‌ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది.! తాడేపల్లిలో ఇటీవల రౌడీషీటర్లు హల్ చల్ చేశారు. విజయవాడకు చెందిన రత్నశేఖర్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి కుటుంబ సభ్యులను ఐదు లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు రాజశేఖర్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఫోన్ కాల్ ద్వారా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రౌడీషీటర్‌లు సాయి, రాంబాబు, శివలను అదుపులోకి తీసుకున్నారు. గత మూడు నెలలుగా ఆర్థికవనరులు సరిగా లేకపోవడంతో పాత నేరస్తులు యాక్టివ్ అయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

* మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిన వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక (ఊపా) చట్టాన్ని ఎత్తివేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

* కశింకోటలో నాటుసారా అనుకొని స్పిరిట్​ తాగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. శనివారం రాత్రి ఐదుగురు వ్యక్తులు కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఇవాళ ఉదయం లేచే సరికి ఆనంద్‌, నూకరాజు అనే ఇద్దరు మృతిచెందగా…అప్పారావు పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం కేజీహెచ్​కు తరలించారు.

* నగరంలో గ్యాంగ్ వార్ లో కొత్త కోణం…రెండు కోట్ల విలువైన ల్యాండ్. యనమల కుదురు లో ఉన్న ఒక ల్యాండ్ సెటిల్ మెంట్ కు సంబంధించి రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం. ఇద్దరు ఒకే ల్యాండ్ విషయంలో జోక్యం చేసుకోవటంతో హత్యాయత్నానికి స్కెచ్ లు వేసిన రెండు వర్గాలు. స్థలం సెటిల్ మెంట్ గురించి రాజీ చేసుకుందామని వచ్చి హత్యాయత్నం దిశగా దాడులు చేసినట్టు గుర్తించిన పోలీసులు.