అమెరికాలో నల్ల జాతీయులపై జరుగుతున్న దారుణాలపై యువ టెన్నిస్ ప్లేయర్ కోరె గాఫ్ తనదైన శైలిలో స్పందించింది. మిన్నెసొటాలో నిరాయుధుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను అతి దారుణంగా హత్య చేయడంపై గాఫ్.. ట్విట్టర్‌లో తన నిరసనను వ్యక్తం చేసింది. ఫ్లాయిడ్‌ను ఊపిరి ఆడకుండా చేసిన పోలీస్ అధికారి డెరెక్ చావిన్ నిరంకుశ తీరుపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న తరుణంలో గాఫ్ వీడియో వైరల్‌గా మారుతున్నది. 29 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోలో నల్ల రంగు హుడీ ధరించిన గాఫ్..ఫ్లాయిడ్, ఆర్బరీ, బెరోనా టేలర్, ట్రెవ్యన్ మార్టిన్ సహా హత్యలకు గురైన నల్లజాతీయుల ఫొటోలు చూపిస్తూ ఇలా ఎందరో అంటూ సాగింది. ‘ఇక తర్వాత నేనేనా? నేను నా గళాన్ని వినిపించాను. మీరు గళం విప్పండి’ అని రాసుకొచ్చింది. గతేడాది కెరీర్ ఆరంభించిన 16 ఏండ్ల గాఫ్ అద్భుత విజయాలతో దూసుకెళుతున్నది.
తదుపరి కాల్చేది నన్నేనేమో!
Related tags :