* విజయనగరం జిల్లా కొమరాడ మండలం కొమరాడ గ్రామంలో సచివాలయం వద్ద గిరిజన హక్కులసాధన కమిటీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 3ని వ్యతిరేకించాలని గిరిజన సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నిరసన చేశారు. సిఐటియు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి సాధన కమిటీ సభ్యులు మెల్లిక గంగరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రజలకు నమ్మక ద్రోహంచేస్తున్నాయి ఇలాంటి సందర్భంలో గిరిజన యువతీ యువకులు పెద్దెత్తున కదిలి పోరాటాలు చేసి మన సమస్యలు సాధించుకునేందుకు ముందుకు రావాలని కోరారు.
* ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి ఘటనపై ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) విచారణ కమిటీ పరిశీలనలో కీలక అంశాలను గుర్తించారు. తన నివేదికలో ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యం, తప్పిదాలను కమిటీ ఎత్తిచూపింది. ముఖ్యంగా, 5 కీలక తప్పిదాలను కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది.
1. అత్యల్ప ఉష్ణోగ్రతల్లో స్టైరీన్ పాలిమరైజేషన్ ను నిలువరించే టీబీసీ స్టోరేజి తగినంతగా ప్లాంట్ లో అందుబాటులో లేదు.
2. ప్లాంట్ లో ఆక్సిజన్ ను ఆవిరిగా మార్చే క్రమంలో మానిటరింగ్ సిస్టమ్ ను అమలు చేయడంలేదు.
3. స్టైరీన్ స్టోరేజి ట్యాంకు టాప్ లేయర్లలో ఉష్ణోగ్రతలను పర్యవేక్షణ చేసే వ్యవస్థను పాటించడంలేదు.
4. ప్లాంట్ లో రిఫ్రిజరేషన్ వ్యవస్థను 24 గంటల పాటు ఆపరేట్ చేయడంలేదు.
5. ప్లాంట్ లోనూ, స్టోరేజి ట్యాంకు వద్ద పర్సన్ ఇన్ చార్జిల నిర్లక్ష్యం, తప్పిదం స్పష్టంగా ఉంది.
… అంటూ ఎన్జీటీ విచారణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.
* పార్వతీపురం మండలం సంగంవలస పంచాయితీ లో ప్రవేశించిన మిడతలదండు కోరిమేట్టపై ఉన్న జీడి చెట్లపై మిడతలు దాడి. విపరీతంగా చెట్లు పైన ఉన్న ఆకులను తినివేస్తున్న మిడతల దండు.
* ఒంగోలు మాత శిశు వైద్యశాలలో తల్లి బిడ్డ మృతి..టంగుటూరు అంబెడ్కర్ నగర్ చెందిన బొమ్మల మాధురి (22) కానుపు కోసం ఎనిమిది రోజుల క్రితం ఒంగోలు మాత శిశు ఆసుపత్రిలో చేరిక..మే 29న పెద్ద ఆపరేషన్ ద్వారా బిడ్డను తీసిన వైద్యులు..ఈ రోజు తెల్లవారుజామున సరైన చికిత్స అందక తల్లి బిడ్డ మృతి…వైద్యుల నిర్లక్ష్యం తోనే తల్లి బిడ్డ మృతి చెందిందని ఆసుపత్రి ముందు మాధవి బంధువుల ఆందోళన..
* కాకినాడ గ్రామీణ మండలం సర్పవరంలో గ్యాస్ లీకైంది. స్థానిక టెకీ రసాయన పరిశ్రమ నుంచి ఈ గ్యాస్ లీకవుతోంది.దీంతో స్థానిక అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* రోడ్డుప్రమాదంలో ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి. తిరుపతి-పూతలపట్టు రహదారిలోని రాహుల్ డాబా సమీపంలో ఘటన. సంఘటనా స్థలానికి చేరుకొన్న చంద్రగిరి పోలీసులు.
* దోనబండ చెక్ పోస్ట్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల తనిఖీలు.మద్యంతో పట్టుబడ్డ ప్రభుత్వ అధికారి. అక్రమంగా మద్యం తీసుకు వెళ్తున్న వీరులపాడు మండల అభివృద్ధి అధికారి తో పాటు మరో ఇద్దరిని పట్టుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు.
* గ్యాంగ్ వార్ లో మృతి చెందిన సందీప్ మృతదేహానికి నేడు పోస్టుమార్టం.ఏర్పాట్లు చేసిన పోలీసులు.ప్రభుత్వ ఆసుపత్రి లో సందీప్ మృతదేహానికి పోస్టుమార్టం.ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్ళే రహదారులు మూసివేసిన పోలీసులు.
* వైసిపి కేంద్ర కార్యాలయం ముట్టడికి యత్నించిన ఎన్ఎన్ఏం ఉద్యోగులు. పోషణ అభియాన్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కింద పని చేస్తున్న 350 మంది. డిసెంబర్ వరకు గడువు ఉన్న ముందుగానే తొలగించడంతో వైసీపీ కార్యాలయం వద్ద నిరసన తెలపటానికి వచ్చిన ఉద్యోగులు.
* తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న వారిని పోలీసులు చెక్‌పోస్టుల వద్ద అడ్డుకుంటున్నారు. దీంతో గరికపాడు చెక్‌పోస్టు వద్ద కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పాసులు ఉన్నవారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. పాసులు ఉన్నవారి చేతిపై హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు.
* చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో విషాదం. ఉరి వేసుకుని మహిళా వాలంటీర్ బాంధవి ఆత్మహత్య.