వినోదాత్మక చిత్రం అనే ప్రస్తావన వస్తే అది ఎస్.వి.కృష్ణారెడ్డి పేరు లేకుండా పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. 1990, 2000 దశకాల్లో ఆయన తీసిన చిత్రాలు సంచలనాలు సృష్టించాయి. యేడాదిపాటు ఆడిన చిత్రాలున్నాయి. స్వచ్ఛమైన హాస్యంతో, ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా చిత్రాల్ని తెరకెక్కించిన ఘనత ఎస్వీ కృష్ణారెడ్డి సొంతం. దర్శకుడిగానే ఆయన సుపరిచితమైనప్పటికీ.. తెలుగు చిత్రసీమకి నటుడిగా పరిచయమయ్యారు. 1976లో ‘పగడాల పడవ’ అనే చిత్రంలో నటించారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘కిరాతకుడు’లో ఒక చిన్న పాత్ర చేశారు. సంగీతంలోనూ మంచి పట్టున్న ఎస్వీ కృష్ణారెడ్డి తాను దర్శకత్వం వహించిన పలు చిత్రాలకి స్వయంగా స్వరాలు సమకూర్చుకొన్నారు. హిందీలో ‘తక్‌దీర్‌వాలా’ తెరకెక్కించారు. ‘జుడాయి’కి కథ, స్కీన్ర్‌ప్లే సమకూర్చారు. ఆంగ్లంలో ‘డైవర్స్ ఇన్విటేషన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు.
వినోదాత్మక సృజనకు చిరునామా….కృష్ణారెడ్డి!
Related tags :