Fashion

పెదవులకు కొబ్బరినూనె మిశ్రమం…

Coconut Oil For Lips-Telugu Fashion News

ఏ రంగు చర్మం ఉన్న వారైనా కొన్ని చిట్కాలు పాటిస్తే అందం రెట్టింపవుతుంది. వంటింట్లో చేసే చిన్న చిన్న బ్యూటీ ప్రయోగాలే చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తాయి. పైగా రసాయనాల బాధ కూడా ఉండదు. ఒకసారి మీరూ ఆ చిట్కాలు ట్రై చేయండి. మేడిపండు, కొబ్బరినూనె మిశ్రమాన్ని పెదవులపై రాసుకుంటే బాగా మెరుస్తాయి. అంతేకాదు ఏ కాలమైనా పెదవులు పగలవు. పొడిచర్మం ఉన్నవాళ్లు ఉదయం లేచిన వెంటనే కొబ్బరినీళ్లు తాగితే చర్మం తేమగా, మృదువుగా తయారవుతుంది. భోజన సమయంలో పుచ్చకాయ, కమలాఫలం, అవకాడో వంటి పండ్లు తింటే చర్మానికి కావలసినంత నీరు అందుతుంది. బొప్పాయి మాస్క్‌ చర్మం మీది మృతకణాలను పోగొట్టి చర్మాన్ని మరింత మెరిపిస్తుంది. పావు కప్పు బొప్పాయి గుజ్జు లేదా బొప్పాయి ముక్కలకు టేబుల్‌స్పూన్‌ తాజా ఫైనాపిల్‌ గుజ్జు కలిపి మెత్తగా చేసి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.చక్కెర వినియోగాన్ని తగ్గిస్తే చర్మం పట్టులా మృదువుగా ఉంటుంది. డైట్‌ నుంచి పది రోజుల పాటు చక్కెరను దూరం పెడితే చర్మ సౌందర్యం రెట్టింపవుతుంది. చర్మానికి బాదం నూనె రాస్తే ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. సూక్ష్మ పోషకపదార్థాలు, తృణధాన్యాలను నిత్యం తీసుకుంటే చర్మం సహజసిద్ధమైన మెరుపులు చిందిస్తుంది.గ్రీన్‌ టీని టోనర్‌గా వాడడం వల్ల కాంతి విహీనంగా ఉన్న చర్మం మెరుపులీనుతుంది.పాలిపోయినట్టుగా ఉన్న చర్మంపై ఛమోమిలి టీ ఐస్‌ క్యూబ్స్‌తో రాస్తే తాజాగా మారుతుంది.