Politics

అభివృద్ధికి ఆయనే అడ్డు

అభివృద్ధికి ఆయనే అడ్డు

రాష్ట్ర అభివృద్ధికి విపక్ష నేత చంద్రబాబు అడ్డుపడుతున్నారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో బొత్స మీడియాతో మాట్లాడారు. పరిపాలన వికేంద్రీకరణ నుంచి పేద ప్రజలకు ఉచితంగా ఇళ్ల స్థలాల వరకూ ప్రతీ అభివృద్ధి పనికి చంద్రబాబు విఘాతం కల్పించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అనుభవమని చెప్పి చివరకి అప్పులు మిగిల్చిపోయారని మండిపడ్డారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు విని.. వాటికనుగుణంగా రెండు పేజీల మేనిఫెస్టోను తయారుచేసి.. కేవలం ఏడాది పాలనలోనే 90 శాతంపైగా సంక్షేమ పథకాలను అమలుచేసిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.