* సెక్రటేరియట్ లో మరో ఇద్దరికి కరోనా..శుక్రవారం జరిపిన టెస్టుల్లో ఒకటి, ఐదు బ్లాక్ లలో పని చేస్తున్న ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ.దీనితో 11 మందికి చేరుకున్న కరోనా వైరస్ బాదికుల సంఖ్య
* కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా/టివి కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లను ప్రారభించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
* గత 24 గంటల్లో భారత్లో అత్యధికంగా 9,983 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
* ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు గురయ్యారు.జ్వరం, గొంతునొప్పి ఉండటంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.హోం క్వారంటైన్ అయిన ఆయన తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు.రేపు ఆయనకు కరోనా టెస్ట్ చేస్తారు.
* ఏపి సచివాలయంలో రెండు పాజిటివ్ కేసులు ఒకటి 1st బ్లాక్ కాగా 2nd కేస్ 4th బ్లాక్ లో ఉద్యోగి కి వచ్చినట్లు సమాచారం ఇప్పటివరకు(సెక్రటేరియట్,అసెంబ్లీలో, ఔట్ సోర్సింగ్, డ్రైవర్ల) 12 కోవిడ్ possittive వచ్చినట్లు తెలుస్తోంది ..ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సచివాలయ సిబ్బంది.