Devotional

7వేల మందికి పైగా దర్శనం చేసుకోవచ్చు

7వేల మందికి పైగా దర్శనం చేసుకోవచ్చు

శ్రీవారి దర్శనాల ప్రారంభంపై టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి కామెంట్స్…

శ్రీవారి దర్శనాల ట్రయల్ రన్ ప్రారంభించాం

తొలి రెండు రోజులు టీటీడీ ఉద్యోగులు, 10వ తేది తిరుమల స్థానికులతో దర్శనాల ట్రయల్ రన్

క్యూలైన్ల నిర్వహణపై అవగాహన వచ్చిన తర్వాత 11వ తేది నుండి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తాం

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తీర్థం, శఠారీ, ప్రసాదాల పంపిణీ నిలిపివేసాం

క్యూలైన్లో భక్తులు నిబంధనలు కచ్ఛితంగా పాటించాలి

భక్తులందరూ ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకుని తిరుమలకు రావాలి

6, 7 వేల మంది కన్నా ఇంకా ఎక్కువ మందికి దర్శనం కల్పించే అవకాశం ఉంది

ఎంత మందికి దర్శనం కల్పించేది త్వరలోనే ప్రకటిస్తాం

కంటైన్ మెంట్ జోన్ లు, రెడ్ జోన్ లలో ఉన్నవాళ్లు, ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులు ఉన్న రాష్ట్రాల ప్రజలు తిరుమలకు రావద్దు

ముందస్తు టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమల కు అనుమతి

టీటీడీ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం

టిటిడి ఏర్పాటు చేసిన ప్రత్యేక సైబర్ వింగ్ ద్వారా దుష్ప్రచారాలు చేసే వారిని గుర్తించి కేసులు పెడతాం

తమిళ నటుడు శివకుమార్ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

టిటిడి ఆస్తుల పై శ్వేతపత్రం విడుదల కు కసరత్తు జరుగుతోంది

టీటీడీ ఆస్తులను అమ్మేప్రసక్తే లేదు భక్తులకు వాస్తవాలు తెలియాలనే శ్వేత పత్రం విడుదల చేస్తున్నాం

టిటిడి ఉద్యోగుల జీతభత్యాలకు నిధుల కొరత లేదు

ఓవర్డ్రాఫ్ట్ వెళ్ళాల్సిన పరిస్థితి లేదు

అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటాం