ఈనాడులో భారీ కుదుపు.. పొమ్మనలేక పొగ పెడుతున్న యాజమాన్యం..
ఇక నుండి డెస్క్, మరియు మిషనరీ, సిబ్బందికి కొద్ది రోజులే ఉద్యోగం, వేతనం..
అర్ధరాత్రి నోటీసుల జారీ..
ఈనాడు ఉద్యోగులపై పిడుగు పడినట్లయింది. కరోనా నేపథ్యంలో అడ్వర్టైజ్మెంట్లు ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గడంతో ఉద్యోగులకు కొద్ది రోజుల పని, వేతనం ఇవ్వగలుగాతామని, నిన్న అర్ధరాత్రి ఈనాడు యాజమాన్యం నోటీసులు జారీ చేసింది.
కొందరికి రెండు మూడు రోజుల పని మాత్రమే ఇవ్వగలుగుతామని నోటీసులో పేర్కొంది. అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రికగా తెలుగు పత్రికల్లో రారాజుగా వెలుగొందిన ఈనాడు దినపత్రిక నేడు కుదేలయింది.
ఉద్యోగులు మాత్రం ఇది పొమ్మనలేక పొగ పెట్టినట్లేనని పదిహేను రోజుల వేతనంతో మేము ఎలా బతకాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
##########
కరోనా కల్లోలం.. చాలా మంది పాత్రికేయులు, ఈనాడులోని పలు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది జీవితాలను కకా వికలం చేసింది. ఇప్పటికే చాలామందిని ఉద్యోగాల్లోంచి తీసేసింది ఈనాడు యాజమాన్యం.
ఇప్పుడు కొత్తగా లే ఆఫ్ పేరుతో కొత్త కోత మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను పూర్తిస్థాయి దినసరి అడ్డా కూలీలుగా మార్చేసింది. అంటే పనిచేసిన రోజుకే జీతం.. లేకుంటే జీతం ఇవ్వరు.