సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు బిల్లు రూ.1000 దాటితే అమ్మో అంత బిల్లు వచ్చిందా..! అని ఆశ్చర్యపోతారు. అలాంటిది రూ.500 బిల్లు రావాల్సిన ఇంటికి ఏకంగా రూ.లక్షల్లో వస్తే ఇంకేమైనా ఉందా. ‘కరెంట్ షాక్’ కొట్టినట్లే అవుతుంది. తాజాగా కామారెడ్డి జిల్లాలోని ఓ సామాన్య రైతు కుటుంబానికి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలంలోని ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన గాండ్ల శ్రీనివాస్ది వ్యవసాయ కుటుంబం. ఆయన ఇంట్లో 3 విద్యుత్ బల్బులు, 2 ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి. వీటికి ప్రతి నెలా రూ.500 వరకు కరెంటు బిల్లు వస్తుంది. ఫిబ్రవరి నెలలో రూ.415 విద్యుత్ బిల్లును చెల్లించారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ బిల్లులు తీయలేదు. ఈ మూడు నెలలకు కలిపి తాజాగా విద్యుత్ శాఖ ఇచ్చిన బిల్లును చూసి విస్మయానికి గురవడం రైతు వంతు అయింది. 3 నెలలకు కలిపి ఏకంగా రూ.7,29,417 విద్యుత్ బిల్లు వచ్చింది. ఇంత భారీ మొత్తంలో వచ్చిన కరెంటు బిల్లు చెల్లించేదెలా అని బాధిత రైతు వాపోతున్నాడు.
తెలంగాణా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
Related tags :