Politics

“చేదోడు” నిండా చేదేనంటున్న చంద్రబాబు

“చేదోడు” నిండా చేదేనంటున్న చంద్రబాబు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న చేదోడు’ మరో జగన్మాయ పథకమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. అబద్ధమే వైకాపా ఆయుధమని వ్యాఖ్యానించారు. గతంలో అందరికీ లబ్ధి చేస్తామని చెప్పి.. ఇప్పుడు షాపులు ఉన్నవాళ్లకే పథకం వర్తిస్తుందని మాట మార్చారని దుయ్యబట్టారు. బుధవారం పార్టీ ముఖ్యనాయకులతో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘జగనన్న చేదోడు’ పేరుతో భారీగా కోతలు పెట్టారు. రాష్ట్రంలో 5.50లక్షలకు పైగా నాయి బ్రాహ్మణులుంటే 38వేల మందికే ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తున్నారు. పథకం ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే రూ.10వేలకంటే రెట్టింపు వారినుంచి లాక్కుంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 13లక్షల మంది టైలర్లు ఉంటే 1.25లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. రజకులు 15లక్షల మంది ఉంటే 82వేల మందికే ఈ పథకం వర్తిస్తోంది’ అని చంద్రబాబు మండిపడ్డారు.