వైఎస్సార్ చేయూత పథకానికి కెబినెట్ ఆమోదం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో 50 వేల ఆర్థిక సాయం అందించనున్న ప్రభుత్వం.
వచ్చే ఆగస్టు 12న పధకం ప్రారంభించనున్న సీఎం జగన్.
రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులపై కెబినెట్ లో చర్చ
విభజన హామీల్లో భాగంగా రామాయపట్నం పోర్టుకి కేంద్రం నిధులివ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డ కెబినెట్.
కేంద్ర నిధుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని కెబినెట్ నిర్ణయం.
ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు ప్రాజెక్టు నిర్మాణం.
మొదటి దశలో . 4736 కోట్ల వ్యయంతో నిర్మాణం.
రామాయపట్నం ఆగస్టు నాటికి టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం జగన్ సూచన.
రామాయపట్నం పోర్టు టెండర్లను జూడిషీయల్ ప్రివ్యూకి పంపాలని సీఎం జగన్ ఆదేశం.
10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
డిస్కమ్, ట్రాన్స్కో లకు 6 వేల కోట్ల ఆత్మనిర్బర్ భారత్ నిధుల ఖర్చుకు కేబినెట్ ఆమోదం
16 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు కేబినెట్ ఆమోదం